టీ 20 వరల్డ్ కప్ లో అతి చిన్నవయసులో సెంచరీ చేసిన   బ్యాటర్ గా యువరాజ్

Spread the love

ప్రస్తుతం టీ 20 వరల్డ్ కప్ లో ఒక యువ క్రికెటర్ సంచలనంగా మారాడు. అతి చిన్న వయసులో టీ20 వరల్డ్ కప్ లో సెంచరీతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతడే 19 ఏళ్ల యువరాజ్ సమ్రా భారత సంతతికి చెందిన కెనడా యువ క్రికెటర్. యువరాజ్ సమ్రా 2006లో కెనడాలోని బ్రాంప్టన్ లో జన్మించాడు. తండ్రి బల్జిత్ సింగ్ కొన్నేళ్ల క్రితం భారత్ నుంచి వెళ్లి కెనడాలో సెటిల్ అయ్యారు. బల్జీత్ కు  క్రికెట్ అంటే ఇష్టం. కొన్ని స్థానిక లీగ్ గేమ్స్ ఆడాడు. భారత సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ అంటే చాలా అభిమానం. ఆ అభిమానంతోనే తన కొడుకుకు కూడా ‘యువరాజ్’ అని పేరు పెట్టుకున్నారు. అంతే కాకుండా  చిన్న వయసు నుండే  క్రికెట్ నేర్పించారు. మరో విశేషమేంటంటే.. యువరాజ్ సింగ్ లాగే యువరాజ్ సమ్రా కూడా ఎలెఫ్ట్ హ్యాండ్  బ్యాటర్. 2019లో గ్లోబల్ టీ20 లీగ్ టోర్నీ కోసం యువరాజ్ సింగ్ కెనడా వెళ్లగా.. అక్కడ యువరాజ్ సమ్రా భారత సీనియర్ ని కలిశాడు.2023లో కెనడా యువ క్రికెట్ టీమ్ లో చోటు దక్కించుకున్నాడు. గతేడాదే వన్డే, అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 8 వన్డే మ్యాచ్లు ఆడాడు. టీ20 వరల్డ్ కప్ లో నిన్న చెన్నై వేదికగా న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్లో అదరగొట్టాడు. 65 బంతుల్లో 110 పరుగులు చేశాడు. ఇందులో 6×6, 11×4 ఉన్నాయి. టీ 20 వరల్డ్ కప్ లో  అతి చిన్న వయసులో (19 సంవత్సరాల 141 రోజులు) సెంచరీ చేసిన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ పాకిస్థాన్ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ పేరిట ఉండేది. అతడు 22 సంవత్సరాల 127 రోజుల వయసులోసెంచరీ  చేయగా.. తాజాగా యువరాజ్ ఆ రికార్డ్ అందుకున్నాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *