లాభాలతో ట్రేడింగ్ ముగించిన సూచీలు 

Spread the love

ఈరోజు ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 325 పాయింట్లు లాభపడి 74,532 పాయింట్ల వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 112 పాయింట్ల లాభంతో 23,114 వద్ద ముగిసింది. డాలర్ తో  రూపాయి మారకపు విలువ రూ.93.52గా కొనసాగుతోంది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చారిత్రక కనిష్ట స్థాయి పడిపోవడం ఆందోళన కలిగించే విషయం. ఇక నేటి ట్రేడింగ్ లో  ఐటీ (IT), పిఎస్ యూ బ్యాంక్ (PSU Bank), మెటల్ షేర్లు మంచి లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ షేర్లు లాభాలతో ముగిశాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *