దేశీయ స్టాక్ మార్కెట్లు భారత్-యూరోపియన్ యూనియన్ ట్రేడ్ ఒప్పందం నేపథ్యంలో లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలు కీలకంగా మారాయి. రూపాయి కోలుకోవడం, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం కూడా కలిసొచ్చింది. నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 319 పాయింట్ల లాభంతో 81,857 వద్ద ముగిసింది. నిఫ్టీ 126 పాయింట్ల లాభంతో 25,175 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 91.66 వద్ద కొనసాగుతోంది. ఉంది. అలాగే అమెరికా టారిఫ్ ల విషయంలో వెనక్కి తగ్గవచ్చన్న అంచనాలు మార్కెట్ సెంటిమెంట్ ను బలోపేతం చేశాయి. దాంతో దేశీయ సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, ఎన్టీటీపీసీ షేర్లు లాభపడ్డాయి. కొటక్ మహీంద్రా,ఎం అండ్ ఎం, ఏషియన్ పెయింట్స్, ఎటర్నల్, మారుతీ సుజుకీ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.