కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ

Spread the love

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నేడు ఢిల్లీలో భేటీ అయ్యారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్రంలో చేసే పోరాటంలో పాల్గొనాలని రాహుల్ ని ఈ సందర్భంగా ఆమె కోరారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి పిబ్రవరి 2 తో 20 ఏళ్లు పూర్తి కానుంది. ⁠బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసిందని ఆక్షేపించారు. ⁠ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరణకు ఏపీలో భారీ ఎత్తున ఉద్యమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని తొలుత ప్రారంభించింది ఏపీ లోనేనని తెలిపారు. ఏపీ నుంచే mgnrega మొదలయింది. ⁠ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన బండ్లపల్లి నుంచి రాష్ట్రంలో ఉద్యమం. ఉపాధి హామీ పోరాటానికి రాష్ట్రానికి రావాలని  రాహుల్ ని ఆహ్వాననించినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ వచ్చేందుకు అంగీకరించారని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు.