ఈరోజు ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లోకి పయనించాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలున్నప్పటికీ హెచ్ఎఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ వంటి షేర్లలో ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతు మార్కెట్ జోరుకు దోహదపడింది. నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైని తాకింది. సెన్సెక్స్ ఉదయం 85,259.36 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే పయనించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 573.41 పాయింట్ల లాభంతో 85,762.01 వద్ద ముగిసింది. నిఫ్టీ 182 పాయింట్ల లాభంతో 26,328.55 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 90.20 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.