భారీ లాభాలతో దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

Spread the love

ఇటీవల భారీ నష్టాలతో కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్ లో భారీ లాభాలతో ముగిశాయి. ఇన్వెస్టర్లు సుమారు ₹6 లక్షల కోట్ల సంపదను తిరిగి పొందారు. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 899 పాయింట్లు పెరిగి 80,016 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 285 పాయింట్లు లాభపడి 24,766 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ పరిణామాలు కూడా కొంత మేర సానుకూలంగా ఉండొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో మార్కెట్ ఇన్వెస్టర్ల జోష్ ను పెంచింది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉందన్న వార్తలు మేరకు అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశలు పెరిగాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.91.65గా కొనసాగుతోంది. అదానీ పోర్ట్స్, హిందాల్కో, ఎల్అండ్‌టీ సహా పలు షేర్లు లాభాలలో పయనించాయి. ఆసియా మరియు అమెరికా మార్కెట్లు సానుకూలంగా ఉండటం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *