సెమీస్ లో ఇంగ్లాండ్ పై సూపర్ విక్టరీ… ఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్

Spread the love

టీ 20 వరల్డ్ కప్ ఫైనల్లోకి డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ప్రవేశించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి 2022 వరల్డ్ కప్ సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. వరుసగా రెండో సారి ఫైనల్ చేరింది. ఇక మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగుల భారీ స్కోరు చేసింది. సంజూ శాంసన్ 89 (42; 8×4, 7×6) మరోసారి కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. శివమ్ దూబే 43 (25; 1×4, 4×6), ఇషాన్ కిషన్ 39 (18; 4×4, 2×6), హార్థిక్ పాండ్య 27 (12; 3×4, 2×6), తిలక్ వర్మ 21 (7; 3×6) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో విల్ జాక్స్ 2 వికెట్లు, అదిల్ రషీద్ 2 వికెట్లు, జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ పడగొట్టారు. టార్గెట్ ఛేజింగ్ లో ఇంగ్లాండ్ కూడా మంచి పోరాటం కనబరిచింది. ముఖ్యంగా జాకోబ్ బెతెల్ 105 (48; 8×4, 7×6) సెంచరీతో అసాధారణ పోరాటం కనబరిచాడు. విల్ జాక్స్ 35 (20; 4×4, 2×6), జాస్ బట్లర్ 25 (17; 4×4, 1×6) పరుగులు చేశారు. భారత బౌలర్లలో హార్థిక్ పాండ్య 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్సర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో భారత జట్టు సమిష్టిగా రాణించింది. దీంతో అద్వితీయ విజయం సాధించి ఫైనల్ చేరింది. ఫైనల్ లో న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *