దేశీయ స్టాక్ మార్కెట్లకు కొనసాగుతున్న లాభాల జోరు

Spread the love

ప్రభుత్వం విడుదల చేసిన ఫైనాన్షియల్ సర్వే ఇన్వెస్టర్లలో జోష్ నింపిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాలతో ముగిశాయి.  2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 6.8 నుంచి 7.2 శాతం మధ్య ఉంటుందని ఫైనాన్షియల్ సర్వే అంచనా వేసింది. అలాగే, 2026 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు లక్ష్యమైన 4.4 శాతాన్ని చేరుకునే దిశగా దేశం పయనిస్తోందని పేర్కొనడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్నిపెంచింది.  దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి, బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 221 పాయింట్లు లాభపడి 82,566 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 76 పాయింట్లు పెరిగి 25,418 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.91.99గా కొనసాగుతోంది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 3 శాతానికి పైగా దూసుకెళ్లగా, నిఫ్టీ హెల్త్‌కేర్, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ సూచీలు నష్టాల్లో ముగిశాయి.