దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాంతాన్ని నష్టాలతో ముగించాయి. దీంతో వరుస లాభాల జోరుకు బ్రేక్ పడింది. బడ్జెట్ కు ముందు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ప్రధానంగా ఐటీ, మెటల్ స్టాక్స్ లో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీనికి తోడు అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలు, రూపాయి విలువ వంటివి కూడా ప్రభావం చూపాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 296 పాయింట్లు నష్టపోయి 82,269 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 98 పాయింట్లు కోల్పోయి 25,320 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.91.94గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో ఐసీఐసీఐ బ్యాంకు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, ఐటీసీ, బీఈఎల్, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.