మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ తో పిబ్రవరి 2 నుంచి చేపట్టే ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర చేపట్టనున్నట్లు ఇప్పటికే ఏపీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఈ యాత్రపై నేడు జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జీలు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ విభాగాలతో వై.ఎస్.షర్మిల సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లా బండ్లపల్లి నుంచి చేపట్టే యాత్రను దిగ్విజయం చేసే విధంగా, MGNAREGA చట్టంతో జరిగే లబ్ధిని, ప్రధాని మోదీ గారు తెచ్చిన VB G RAM G (గ్రామ్ జి) చట్టం ద్వారా జరిగే నష్టాన్ని ఉపాధి హామీ పథకం లబ్ధి దారులకు వివరించాలని, గ్రామ్ జి చట్టాన్ని రద్దు చేసేలా ఉద్యమ కార్యాచరణ ఉండాలని నాయకత్వానికి దిశా-నిర్దేశం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.