బంగ్లాదేశ్ ప్రధానిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ రేపు ప్రమాణం చేయనున్నారు.ఇటీవల జరిగిన ఆ దేశ ఎన్నికల్లో ఆయన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని భారత ప్రధాని మోదీకి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. అయితే అదే రోజు ముంబయిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో పాల్గొనాల్సిన కార్యక్రమాలు ఉండడంతో భారత్ తరఫున లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.. ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు. భారత్ సహా 13 దేశాలకు మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. భారత్-బంగ్లా మధ్య ఇటీవల నెలకొన్న సంబంధాల గురించి తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీ.ఎన్.పి విజయం సాధించగానే తారిఖ్ రెహమాన్ కు భారత ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందించిన సంగతి తెలిసిందే.