ఫ్లాట్ గా ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు 

Spread the love

స్వల్ప లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్ గా ట్రేడింగ్ ముగించాయి. అమెరికా-ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. దీంతో రోజంతా సూచీలు ఒడిదుడుకుల్లో కదలాడాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ సుమారు 26 పాయింట్లు లాభపడి 78,520 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 24,364 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.93.05గా కొనసాగుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 94 డాలర్లకు పైబడి కొనసాగుతోంది. ఇక సెన్సెక్స్ 30లో ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్, ఎస్.బీ.ఐ షేర్లు లాభపడ్డాయి. మెటల్, పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు రాణించగా, ఐటీ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *