ప్రముఖ తమిళ అగ్ర నటుడు అజిత్ కుమార్ సినిమాలలో అగ్రపథాన దూసుకుపోతూ మరోవైపు మోటార్ రేసింగ్ లో కూడా తన ఆసక్తిని, ఇష్టాన్ని చూపిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రేసింగ్ లలో సత్తా చాటిన ఆయన తాజాగా దేశం గర్వపడే విధంగా మరో ఘనతను సాధించారు. తాజాగా ప్రఖ్యాత సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోర్‌చాంప్స్‌లో జరిగిన ’24H సిరీస్ – GT3 ప్రో-యామ్’ రేసింగ్‌లో అజిత్ కుమార్ రేసింగ్ టీమ్ P2 రెండవ స్థానంలో నిలిచింది. ఇది యావత్ భారతదేశం గర్వించదగ్గ క్షణమని పట్టుదల, ధైర్యం మరియు సంకల్పం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని ఈ విజయం నిరూపించిందని అజిత్ అభిమానులతో పాటు నెటిజన్లు తమ స్పందన తెలియజేస్తున్నారు. ఇక పోడియంపై అజిత్ దేశ జాతీయ పతాకాన్ని పట్టుకుని దేశం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు.