పుష్ప సినిమా అయ్యేవరకు బన్నీ అదే మన అల్లు అర్జున్ జస్ట్ టాలీవుడ్ లో టాప్ హీరో… కానీ సుకుమార్ పుష్ప రెండు సినిమాలు రిలీజ్ అయినా తరవాత బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. పుష్ప 2 సినిమా ఐతే ఏకంగా అదిరిపోయే కలెక్షన్లు వసూలు చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించింది. సో, ఇప్పుడు బన్నీ నెక్స్ట్ సినిమా పైనే అందరి దృష్టి…ఆయన ప్రస్తుతం తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో చేతులు కలిపారు. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయిన క్షణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. “ఇది సాధారణ సినిమా కాదు… ఏదో పెద్దది ప్లాన్ చేస్తున్నారు” అన్న భావన అందరికీ కలిగింది. ఎందుకంటే, అనౌన్స్మెంట్ ప్రోమో లోనే హాలీవుడ్ స్టూడియో, అనిమేషన్స్ స్టూడియో ఇలా ఇవన్నీ ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచేసింది! ఇప్పటివరకు సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించలేదు. ఫస్ట్ లుక్ లేదు, గ్లింప్స్ లేదు… కనీసం ఒక స్టిల్ కూడా బయటకు రాలేదు. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కి ఇంత సైలెన్స్ పాటించడం అంటే… మేకర్స్ ఏదో చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారనే అంచనాలు అభిమానుల్లో బలపడుతున్నాయి. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దీపికా పదుకునే కూడా ఈచిత్రంలో నటిస్తున్నారు.