నిన్న జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. బారామతి లోని విద్యా ప్రతిస్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు నిర్వహించారు. కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే, ఏపీ మంత్రి నారా లోకేష్ తదితర ప్రముఖులు ఆయన అంత్యక్రయాలకు హాజరయ్యారు. ఆయన అంత్యక్రియల కోసం భారీగా ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. నిన్న జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం బారామతికి వస్తుండగా విమానాశ్రయం సమీపంలో విమానం కూలడంతో అజిత్ పవార్ సహా మరో నలుగురు ఈ దుర్ఘటనలో మరణించారు.