అదరగొడుతున్న ఘట్టమనేని కుర్రాడు

Spread the love

ఘట్టమనేని కుటుంబం నుండి మరో హీరో తెరంగ్రేటం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఘట్టమనేని రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’  సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. అలనాటి సూపర్ స్టార్ కృష్ణ, నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు లెగసీని దృష్టిలో ఉంచుకుని  ఈ యంగ్ హీరో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే… ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రష థడానీ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇది ఆమెకు మొదటి తెలుగు  ప్రాజెక్ట్. ఇద్దరూ కొత్తవాళ్లే కావడంతో, వారి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి మొదటి నుంచే ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లలో ఇద్దరూ చాలా ఫ్రెష్‌గా, క్యూట్‌గా కనిపించడంతో ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది.ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. “అల్లెల్లే అల్లెల్లే” అంటూ సాగిన ఈ పాట సూపర్ గా ఉండడం తో వెంటనే ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇంకా జీ.వీ ప్రకాష్ మ్యూజిక్‌ బాగుంది. జయకృష్ణ చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు.  మొత్తానికి శ్రీనివాస మంగాపురం సినిమా ఒక ఫ్రెష్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. కొత్త హీరో, కొత్త హీరోయిన్, అనుభవజ్ఞుడైన దర్శకుడు అన్ని కలిపి ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *