రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజయింది. మొత్తం 10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 2026లో ఈ సభ్యుల పదవీ కాలం ముగియనుండటంతో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 26 నోటిఫికేషన్ రానుంది. మార్చి 16న పోలింగ్ జరపనున్నారు. మార్చి 5 నామినేషన్ల స్వీకరణ, మార్చి 9 నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండనుంది. మార్చి 16 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజున ఫలితాలు ప్రకటించనున్నారు. ఇక తెలంగాణ నుండి రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి.