మరోసారి నాగార్జున నాగ చైతన్య కాంబినేషన్..? 

Spread the love

కెరీర్ ప్రారంభంలో లవ్ స్టోరీలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగ చైతన్య ప్రస్తుతం వైవిద్యకథా చిత్రాలతో నటుడిగా ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నారు. ‘తండేల్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయారు. ఈ నేపథ్యంలో అక్కినేని అభిమానులకు మరొకసారి డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. చైతన్య మరోసారి తన తండ్రి నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేయబోతున్నాడట. ఈ తండ్రీ-కొడుకుల కాంబినేషన్ గురించి అభిమానులకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు సినిమాల్లో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి అదే హిట్ కాంబినేషన్ రిపీట్ అయితే అభిమానులకు మళ్లీ పండుగే. ఈ కొత్త ప్రాజెక్ట్‌ను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించనున్నారని సమాచారం. ఆయన ఇప్పటికే ఈ తండ్రీ-కొడుకుల కాంబినేషన్‌ను తెరకెక్కించిన అనుభవం ఉంది. అందుకే ఈ సినిమా మీద మరింత అంచనాలు పెరిగాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కినేని అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్‌ను మరోసారి పెద్ద స్క్రీన్‌పై చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తండ్రి-కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, సరదా సంభాషణలు అన్ని ఈ సినిమాకు హైలైట్ అవుతాయని భావిస్తున్నారు. మరోవైపు నాగ చైతన్య తన కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయికి కూడా సిద్ధమవుతున్నాడు. ఆయన 25వ సినిమా కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాడట. ఈ మైల్స్‌అయితే  అధికారిక ప్రకటన రాలేదు. ఇక మరోవైపు, కింగ్ నాగార్జున కూడా తన కెరీర్‌లో ఒక పెద్ద మైలురాయికి సిద్ధమవుతున్నారు. ఆయన 100వ సినిమాతో మరోసారి వార్తల్లో నిలిచారు. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *