‘ధురంధర్-2’ నుండి పవర్ ఫుల్ సాంగ్

Spread the love

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ధురంధర్-2’.  గతంలో వచ్చిన మొదటి భాగం కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందింది. ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే కథాంశంతో ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి భాగం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటింది. మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా నుండి తాజాగా ఒక సాంగ్ ను మూవీ టీమ్ విడుదల చేసింది. ఆరి ఆరి అంటూ సాగే ఈ సాంగ్ ను విడుదల చేశారు. మొదటి భాగం హిట్ కావడంతో ప్రస్తుతం ఈ సినిమాపై మంచి హైప్ ఉంది. వచ్చే వారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్‌ కు కూడా మంచి స్పందన లభించింది. ట్రైలర్‌ లో చూపించిన యాక్షన్ సన్నివేశాలు, రణవీర్ సింగ్ ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా మొదటి రోజు నుండే మంచి ఓపెనింగ్ సాధించే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *