వెనుజువెలా ఆయిల్ కొనేందుకు భారత్ రెడీ..ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Spread the love

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనెజువెలా నుంచి చమురు దిగుమతులకు భారత్ ముందుకొచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మీడియాతో  మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వెనెజువెలాకు చైనా ఇచ్చిన అప్పును తిరిగి చమురు రూపంలో పొందనుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ  ఆయిల్ విషయంలో అగ్రిమెంట్  కుదుర్చుకోవడానికి మేము చైనాను స్వాగతిస్తున్నాం, మేము ఇప్పటికే వెనెజువెలాతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. ఇందులో భారత్ కూడా చేరనుంది. భారత్ ఇకపై ఇరాన్ నుంచి కాకుండా వెనెజువెలా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. దీనికి సంబంధించిన ఒప్పందంపై ఒకఅవగాహనకు వచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు.