యాక్టర్ గా బిజీగా ఉంటూనే డాక్టర్ డిగ్రీ అందుకున్న నటి శ్రీలీల 

Spread the love

దాదాపుగా అన్ని భాషా చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ శ్రీలీల డాక్టర్ అయ్యారు. ఒక పక్క వరుస చిత్రాల్లో నటిస్తూనే మెడిసిన్ ఎడ్యుకేషన్ చదువుకుంటున్న ఆమె ఇటీవల ముంబయిలో జరిగిన యూనివర్సిటీ  స్నాతకోత్సవంలో పట్టా అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ శ్రీలీల అంటూ సోషల్ మీడియాలో అభిమానులు తమ విషెస్ తెలుపుతున్నారు.  “అమ్మమ్మ పడిపోయినప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అన్నయ్య వచ్చి చిన్నపాటి ట్రీట్మెంట్  చేశాక ఆమె మామూలు స్థితిలోకి వచ్చింది. దాంతో డాక్టర్  కావాలని అప్పుడే నిర్ణయించుకున్నానని శ్రీలీల ఓ సందర్భంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. కన్నడలోని ‘కిస్’ చిత్రంలో వెండితెరపై హీరోయిన్గా పరిచయమైన శ్రీలీల యువ కథానాయకులతోపాటు టాప్ హీరోలతో కూడా అవకాశాలను అందిపుచ్చుకుని దూసుకుపోతోంది.  ఇటీవల ‘పరాశక్తి’లో కనిపించిన ఆమె.. అగ్రనటుడు పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్నారు.