‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో ‘నల్ల నాగప్ప’ గా తమిళ నటుడు పార్తీబన్

Spread the love

మన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పటికే అభిమానుల్లో నెక్స్ట్ లెవెల్ ఎక్సపెక్టషన్స్ ఉన్నాయ్. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్‌లకు ప్రత్యేకమైన స్టైల్‌ను అందించిన దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, 2026 మార్చి 26న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన తమిళ నటుడు పార్తీబన్  లుక్ ను విడుదల చేశారు.ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్ర పేరు ‘నల్ల నాగప్ప’ అని వెల్లడించారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి పాట “దేఖ్ లేంగే సాలా” మంచి స్పందన అందుకోగా, త్వరలోనే రెండో సింగిల్‌ను కూడా విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తోంది. పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా  పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్ తో వస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. విడుదలకు ముందే విలన్ ఫస్ట్ లుక్‌తో హైప్ పెంచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.