
Vijay Devarakonda Next Movie: విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన కింగ్ డమ్ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. నాగవంశీ నిర్మించిన ఈ సినిమా స్టడీ కలెక్షన్స్ తో రన్ అవుతుంది. అయితే.. ఈ సినిమా ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ నెక్ట్స్ మూవీ పై పడిందని.. నిర్మాతలు ఆలోచనలో పడ్డారని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మరి.. కింగ్ డమ్ ఎఫెక్ట్ తో మారిన నెక్ట్స్ మూవీ ప్లాన్ ఏంటి…?
విజయ్ దేవరకొండ లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్.. ఈ మూడు సినిమాలతో నిరాశపరిచాడు. దీంతో కింగ్ డమ్ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాలని తపించాడు. తన మనసులో మాటలను బయటపెట్టాడు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వెళ్లి టాప్ లో కూర్చుంటా అంటూ పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ పై విమర్శలు రావడం.. ఆతర్వాత విజయ్ కాస్త తగ్గి మాట్లాడడం తెలిసిందే. అయితే.. కింగ్ డమ్ మాత్రం ఫస్ట్ డే నుంచే నెగిటీవ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి పై విమర్శలు వచ్చాయి.
టాక్ ను పట్టించుకోకుండా.. విమర్శలను సీరియస్ గా తీసుకోకుండా.. తమ వంతుగా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు కానీ.. కలెక్షన్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. దీంతో విజయ్ దేవరకొండ సినిమా నెగిటివ్ టాక్ వస్తే.. ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఓ క్లారిటీ వచ్చింది. ఈ మూవీ రిజెల్ట్ తో విజయ్ తో నెక్ట్స్ మూవీ చేయనున్న మైత్రీ మూవీ మేకర్స్ ఆలోచనలో పడ్డారట. బడ్జెట్ ను బాగా తగ్గించాలి అనుకుంటున్నారట. తదుపరి చిత్రాన్ని విజయ్.. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ తో చేయనున్నారు. ఇది భారీ పీరియాడిక్ మూవీ. దీనికి బడ్జెట్ కాస్త ఎక్కువే అవుతుందని ముందు నుంచి అనుకున్నారు. Vijay Devarakonda Next Movie.
ఇప్పుడు కింగ్ డమ్ సినిమా అంచనాలు అందుకోలేకపోవడం.. కలెక్షన్స్ అంతంత మాత్రమే రావడంతో బడ్జెట్ విషయంలో కోత విధించారనే టాక్ వినిపిస్తోంది. రాహుల్ సాంకృత్యన్ ఈ కథ పై చాన్నాళ్లు నుంచి కసరత్తు చేస్తున్నాడు. మంచి కథ చెప్పాలని తపించే దర్శకుడు రాహుల్. రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే సినిమా ఇది. ఇందులో కథ, కథనం అంతా చాలా వైవిధ్యంగా ఉంటుందని సమాచారం. ఇప్పుడు బడ్జెట్ విషయంలో ఆలోచనలో పడడంతో ఈ మూవీ ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది అనేది తెలియాల్సివుంది. మరి.. ఈ సినిమాతో అయినా విజయ్ ఆశించిన బ్లాక్ బస్టర్ సాధిస్తాడో లేదో చూడాలి.
Also Read: https://mega9tv.com/cinema/akhanda-2-release-date-has-been-changed-due-to-pawans-og/