ఆంధ్రకింగ్ తాలూక టీజర్ రివ్యూ..!

Spread the love

Andhra King Taluka Teaser: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, పి. మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ ఎంటర్‌టైనర్ ఆంధ్రా కింగ్ తాలూకా. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు అభిమానుల్లో మంచి హైప్ ను పెంచాయి. రామ్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నట్లు.. మూవీ టీం ఇప్పటికే వదిలిన లుక్ ద్వారా అర్ధమైంది.

ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేసింది. సినిమాకి ఎందుకు తీసుకెళ్లావ్.. పిల్లాణ్ణి ఇలాగే పాడుచేసి పెట్టు అని రామ్ తల్లి డైలాగ్‌ తో టీజర్ మొదలుకాగా.. సినిమాలు చూసి ఎవరు చెడిపోతారే అంటూ తండ్రి రావు రమేష్ సమాధానం ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. వాళ్ల సమస్యని మన సమస్య అనుకోవడమేరా ప్రేమంటే, నీకు నైజాంలో కోసి, గుంటూరులో కారం పెట్టి సీడెడ్‌లో ఫ్రై చేసి, ఆంధ్రాలో పలావు వండేత్తే మొత్తం తెగిపోద్ది.. అంటూ గోదావరి యాసలో రామ్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

కాలేజీ నేపథ్యంలో సాగే ఈ కథలో హీరోల ఫ్యాన్‌ మధ్య వార్ గురించి లోతుగా చూపించినట్లుగా టీజర్ ద్వారా తెలుస్తోంది. ఫ్యానూ ఫ్యానూ అని నువ్వు ఓ గుడ్డలు చింపేసుకోవడమే గానీ నవ్వొకడివి ఉన్నావని కూడా మీ హీరోకి తెలియదు. ఏం బతుకులురా మీవి అంటూ లాస్ట్‌ లో మురళీశర్మ చెప్పే డైలాగ్ యూత్‌ కి గట్టిగా తగిలేలా ఉంది. రామ్ పోతినేని సినిమా అభిమాని పాత్రలో ప్రతి హీరో అభిమాని ఈ పాత్రలో తమను తాము చూసుకుంటారు. రామ్ పర్ఫామెన్స్ సూపర్బ్ గా ఉంది. భాగ్యశ్రీ బోర్సే అందం అభినయం కలగలిపి చక్కగా ఉంది. Andhra King Taluka Teaser.

ఇక రావు రమేష్ మరియు తులసి రామ్ తల్లిదండ్రులుగా కనిపించగా , సత్య అతని స్నేహితుడిగా, మురళీ శర్మ థియేటర్ ఓనర్ గా కనిపించారు. తొలి చిత్రంతోనే పెద్ద విజయాన్ని అందించిన దర్శకుడు మహేష్ బాబు పి, మరోక మంచి కథతో రాబోతున్నాడు. వివేక్-మెర్విన్ నేపథ్య సంగీతం టీజర్ కథనాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు నాణ్యతతో ఉన్నాయి. టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. రామ్ ఎనర్జీ, మాస్ డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి. ఆంధ్ర కింగ్ నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది.మొత్తమ్మీద ఆంధ్రా కింగ్ తాలూకా టీజర్ చూశాక పాజిటివ్ వైబ్స్ పెరిగాయి. ఇటీవల కాలంలో సరైన హిట్ లేని రామ్ పోతినేని ఈ మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయమని ఆయన ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.