
Pak afghan war: పాకిస్థాన్ – అప్ఘానిస్తాన్ ల మధ్య యుద్ధం మొదలైంది. మూడు రోజుల నుంచి వార్ నడుస్తోంది. ఇప్పటికే పాక్ కు చెందిన 9 మంది సైనికులు మరణించారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న వార్ నేపథ్యంలో.. భారత్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం ఏంటి..? పాకిస్థాన్ – అప్ఘానిస్తాన్ మధ్య యుద్ధానికి భారత్ కారణామా..? ఈ దేశాల మధ్య వార్ కు ప్రధాన కారణాలేంటి..? ఇది ఎప్పుడు ముగిసే అవకాశం ఉంది..?
పొరుగు దేశాలను పక్కన పెట్టి మరీ తాలిబన్ల లతో చేతులు కలిపింది భారత్. ఉగ్రవాద తాలి బన్ లు అప్ఘానిస్తాన్ ను ఏలుతున్నారు. తాలి బన్ లు నిజంగానే ఉగ్రవాదులే. ఆ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. అలాగని అది డెమోక్రటిక్ మోనార్కీ కూడా కాదు. ఇస్తామిక్ ఎమిరేట్స్ పేరుతో.. ఏలాంటి ఎన్నికలు లేకుండా తాలిబన్ల ప్రభుత్వం అప్ఘానిస్తాన్ లో నడుస్తోంది. వారికి మానవ హక్కులు, మహిళల హక్కులు పట్టవు. మహిళలను మనుషులుగా కూడా చూడని ఉన్మాదులు తాలిబన్ లు అంటే.. అలాంటి అప్ఘాన్ తో ఇండియా దోస్తీ ఏంటి..? మన అంతా నీచస్థాయికి దిగజారిపోయామా..? ఇప్పటి వరకు మేజార్టీ దేశాలు తాలిబన్ లు సర్కార్ కు మద్దతు తెలపలేదు. అలాంటి తాలిబన్ లతో భారత్ విదేశాంగమంత్రి భేటీ అయ్యారు. అంటే.. తాలిబన్ ల సర్కార్ ను భారత్ అధికారంగా గుర్తించినట్లేనా..? ఇటీవలే..తాలిబన్ విదేశాంగా మంత్రి అమీర్ ఖాన్ ఇండియా వచ్చాడు. ఢిల్లీలో భారత్ విదేశాంగ మంత్రి జయశంకర్ తో ధ్వైయిపాక్షిక చర్చలు జరిపారు. భారత్ అప్ఘాన్ ను క్లోజ్ ఫ్రెండ్ లా చూస్తుందన్నారు. ఆప్ఘాన్ లో మైనింగ్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని భారత పారిశ్రామిక వేత్తలను అమీర్ ఖాన్ ఆహ్వానించాడు. అప్ఘాన్ గడ్డపై భారత్ వ్యతిరేక కార్యకలపాలను జరగనివ్వమని హామీ ఇచ్చాడు.
ఇదంతా ప్రాక్టికల్ గా బాగానే ఉంది. కానీ తాలిబన్ లు చెప్పే మాటలు ప్రాక్టికల్ గా సాధ్యమేనా..? తాలిబన్ లు ఉగ్రవాదులే కాదు.. ఉన్మాదులే అనడానికి ఢిల్లీలో వారు వ్యవహారించిన తీరే సాక్ష్యం.జయశంకర్ తో భేటీ తర్వాత అమీర్ ఖాన్ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ అందరిని ఆహ్వానించిన.. మహిళ జర్నలిస్టులను మాత్రం అనుమతించలేదు. అప్ఘాన్ సర్కార్ లో మహిళలకు హక్కులు లేవు.
ఆ దేశంలో ఆడపిల్లలు చదవుకోవడానికి వీలులేని పరిస్థితులు ఉన్నాయి. ఇక జాబ్ చేయ్యమనేది అసలు సాధ్యం కాదు. ఢిల్లీలోనూ అలాంటి పరిస్థితి కల్పించాడు. ఆయన వ్యవహారించిన తీరుపై ఇండియన్ జర్నలిస్టులే మండిపడుతున్నారు. బేటీ బచావో..బేటీ పడవో అంటూ నినాదాలు ఇచ్చే మోడీ సర్కార్ మహిళలను సెకండ్ క్లాస్ ల పరిగణిస్తుందా..? అని ప్రశ్నిస్తున్నారు.
వాస్తవంగా చెప్పాలంటే.. భారత్ కు మొదటి నుంచి అప్ఘాన్ తో సత్సంబంధాలు ఉన్నాయి. అమెరికా నేతృత్వంలో పపెట్ ప్రభుత్వం నడిచినప్పుడు కూడా ఇండియా సాయం చేసింది. ఇప్పుడు ఆ సాయాన్ని కొనసాగిస్తోంది. అప్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ తో చర్చలు జరిపిన భారత్ విదేశాంగ మంత్రి జయశంకర్.. భారత్ ఎప్పుడినుంచో అప్ఘాన్ కు చేస్తున్న సాయాన్ని.. ఇక మీదట కూడా కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. అయితే భారత్ అప్గాన్ తో చేతులు కలపడానికి కొన్ని వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి. పాక్ కు అటు అప్ఘాన్, ఇటు భారత్ ఉంటుంది. అయితే పాక్ – అప్ఘాన్ లకు పడదు. భారత్ కు కూడా పాక్ శుత్రువే. కాబట్టి శత్రువుకు శ్రతువు మిత్రడే అన్న సామెత సరిగ్గా సరిపోతోంది. అయితే ఈ మీటింగ్ జరిగిన తర్వాతే పాక్ – అప్గాన్ ల యుద్ధం స్టార్ట్ అయ్యింది. దీంతో భారత్ మద్దతునే అప్గాన్ వార్ మొదలుపెట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వాస్తవంగా చెప్పాలంటే.. తాలిబన్ – పాకిస్థాన్ మధ్య మొదటి నుంచి పచ్చిగడ్డి వేస్తే భగ్గమంటోంది. ఇందుకు ప్రధాన కారణం టీటీపీ. దీన్ని తేహరికి తాలిబనర్ పాకిస్థాన్. ఇది ఇది ఉగ్రవాద సంస్థ. దీనికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు మద్దతు ఇస్తున్నారు. ఈ టీటీపీ సంస్థ.. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్ లో దాడులకు తెగబడుతుంది. రైళ్లు పేల్చివేయటం.. బాంబులు పేల్చటం వంటివి చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా.. తాలిబన్ల మద్దతుతో నడుస్తున్న టీటీపీని కట్టడి చేయాలని పాకిస్తాన్ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నా.. ఆఫ్ఘన్ తాలిబన్ల డోంట్ కేర్ అన్నట్లు ఉన్నారు. దీంతో పాకిస్తాన్ .. ఆఫ్ఘనిస్తాన్ లోని టీటీపీ టార్గెట్ గా విమానదాడులకు తెగబడింది. మరో కీలక అంశం. పాకిస్తాన్ దేశంలో ఉన్న లక్షల మంది ఆఫ్ఘనిస్తానీయులను తిరిగి వాళ్ల దేశం పంపిస్తుంది పాకిస్తాన్. తాలిబన్లపై ఒత్తిడి తీసుకురావటానికి శరణార్థులను ఉపయోగిస్తుంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఆర్థికంగా చితికిపోయింది. తాలిబన్ల దగ్గర డబ్బులు లేవు. ఈ క్రమంలోనే లక్షల మందిని తిరిగి ఆఫ్ఘనిస్తాన్ పంపించటం ద్వారా.. తాలిబన్లపై ఒత్తిడి తీసుకొస్తుంది. ఇది కూడా తాలిబన్లకు తలనొప్పిగా మారింది. Pak afghan war.
మరో అంశం డ్యూరాండ్ లైన్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య 2 వేల 600 కిలోమీటర్లు సరిహద్దు ఉంది. ఆ సరిహద్దు నుంచి టీటీపీ ఉగ్రవాదులు పాకిస్తాన్ లోకి ప్రవేశించి పాకిస్తానీయులను చంపుతున్నారనేది పాక్ వాదన. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యం మధ్య తరచూ కాల్పులు, గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు తాలిబన్ల విషయంలో ఆచితూచి స్పందించిన పాకిస్తాన్.. ఇప్పుడు టీటీపీ టార్గెట్ గా ఆఫ్గనిస్తాన్ దేశంపై వైమానిక దాడులకు దిగింది. టీటీపీ చీఫ్ ను చంపినట్లు కూడా ప్రకటించింది పాక్. ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత పాకిస్థాన్ సరిహద్దుల్లో తాలిబన్ దళాలు దాడులకు దిగాయి. ఈ దాడుల్లో 12 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారు. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాలిబన్ నేతృత్వంలోని అప్ఘన్ దళాలు డ్యూరాండ్ లైన్ వెంబడి ఉన్న పక్టియా, దక్షిణ హెల్మండ్ వెంబడి ఉన్న అనేక పాకిస్థాన్ ఆర్మీ అవుట్ పోస్టులను ధ్వంసం చేశాయని అఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కునార్, హెల్మండ్ ప్రావిన్సుల్లో డ్యూరాండ్ లైన్ వెంబడి పాకిస్థాన్ సైన్యం నుండి తాలిబన్ దళాలు అనేక అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయని ప్రకటనలో తెలిపారు. పాక్, అఫ్గాన్ దేశాల మధ్య పరిణామాలను భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ రెండు దేశాల్లోని బాధితులు భారత్ వైపు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశ భద్రతకు ముప్పుగా భావిస్తుంది భారత్.. మొత్తానికి పాక్, ఆఫ్గనిస్తాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. కాకపోతే పూర్తి స్థాయిలో కాదు. ఆఫ్ఘన్, పాక్ రెండు దేశాలు ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాయి. ఒక వేళ పూర్తి స్థాయి యుద్ధం చేసినా.. అది మూడు, నాలుగు రోజుల్లోనే క్లోజ్ అవుతోంది.