ఒకప్పుడు వీడియో అంటే అందులో ఉన్న కంటెంట్ అందరూ కూడా అది నిజమేనని నమ్మే పరిస్థితి ఉండేది టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్న వేళ ఏది నిజమో? ఏది అబద్దమో? తెలియని పరిస్థితి నెలకొని ఉంది. ఏఐ తో చేసిన ఫోటోలు, వీడియోలు లెక్కలేనన్ని సోషల్ మీడియా నిండా కనిపిస్తూ గందరగోళాన్ని కలిగిస్తున్న సందర్భాన్ని కూడా ప్రస్తుతం చూస్తున్నాం. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి గొడవ పడుతున్నట్లు ఉన్నఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సినిమా ఈజ్ డెడ్’ అంటూ రామ్ గోపాల్ వర్మ షేర్ చేసిన ఈ వీడియోపై అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరు ఈ క్రియేటివిటీని ప్రశంసిస్తుంటే, మరికొందరు తప్పుపడుతున్నారు. ‘ఏఐతో ఏదైనా సాధ్యమే!’అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘వారణాసి ప్రమోషన్స్ టైమ్ లో కచ్చితంగా ఈవీడియోను ప్లే చేస్తారని కామెంట్స్ జోడిస్తున్నారు.
ఇక మహేష్ బాబు-రాజమౌళి కలయికలో భారీ చిత్రంగా ‘వారణాసి’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పృథ్వీ రాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా వంటి భారీ తారాగణంతో ప్రపంచస్థాయి ఆకర్షణలతో ఈ మూవీ రానుంది. 2027 ఏప్రిల్ 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.