కల్తీ పాల వినియోగంతో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

Spread the love

రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్‌ లో కల్తీ పాల వినియోగంతో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు  రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. హాస్పిటల్ లో చేరిన వారి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. కోరుకొండ మండలం, నరసాపురం గ్రామంలోని వరలక్ష్మీ మిల్క్ డెయిరీ 106 కుటుంబాలకు రోజూ పాల సరఫరా చేస్తోంది. ఈ డెయిరీ నుంచి వచ్చిన పాలను తాగి అనారోగ్యం పాలయ్యారని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నారు. మరో 8 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ముగ్గురు 70 ఏళ్లకు పైబడిన వారు కాగా ఒకరు 58 ఏళ్ల వయసు వారు ఉన్నారు. బాధితుల నుంచి నమూనాలను తీసుకుని హైదరాబాద్, విశాఖపట్నం ల్యాబ్స్‌కు పరీక్షల కోసం పంపించారు. డెయిరీ నిర్వాహకుడు అద్దాల గణేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *