మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్ ఎప్పుడు వచ్చిన ప్రేక్షకులు ఆదరించడంలో ముందుంటారు. మరోసారి అటువంటి కథా నేపథ్యంలో సినిమా రాబోతుందంటే సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనడం సహజం. అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం అలాంటి ఆసక్తిని కలిగిస్తున్న సినిమా ‘గాడ్ ఆఫ్ వార్’. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ చిత్రం గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించబోతుండటం వల్ల సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఆయన సినిమా అంటేనే అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఒక ఉత్సాహం. త్రివిక్రమ్ సినిమాల్లో ఎమోషన్స్, డైలాగ్స్, పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ లతో సినిమాలను మరో స్థాయికి తీసుకెళ్తాడు. ఈ సినిమా కుమారస్వామి కథ ఆధారంగా రూపొందుతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. పురాణాల నేపథ్యంతో, భారీ విజువల్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాలని త్రివిక్రమ్ చాలా ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు ఎన్నో మైథలాజికల్ సినిమాలు వచ్చినా.. మోడ్రన్ టెక్నాలజీ, భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఒక కొత్త అనుభూతిని ఇవ్వాలన్నదే త్రివిక్రమ్ టార్గెట్ అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో హీరో ఎవరనే దానిపై కూడా పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొదట అల్లు అర్జున్ పేరు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పేర్లు వినిపించాయి.దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. “చివరకు కుమారస్వామి పాత్రలో ఎవరు నటిస్తారు?” అన్న ప్రశ్న అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
తాజా సమాచారం ప్రకారం… అన్ని ఊహాగానాలకు తెరదించుతూ ఈ సినిమా మళ్లీ ఎన్టీఆర్ చేతికే వచ్చి ఫైనల్ అయినట్లు టాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే మరోవైపు త్రివిక్రమ్ తెరకెక్కించే మైథలాజికల్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు కూడా సైలెంట్ గా జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు God of War అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే అసలు టైటిల్ ఇదేనా? లేక తర్వాత మారుతుందా? అనే దానిపై అధికారిక ప్రకటన వస్తే కానీ స్పష్టత రాదు. అయితే ఈ టైటిల్ మాత్రం అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచింది. ఇక త్వరలో ఎన్టీఆర్ బర్త్ డే ఉండడంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైనా అధికారిక ప్రకటన ఉండొచ్చని అటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.