బీఆర్‌ఎస్ పాలనలో ఐటీ ఎగుమతుల్లో 299% పెరుగుదల నమోదవ్వడమే కాదు… దేశంలోని ప్రతి మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణే సృష్టించింది అని 2023-24 గానూ ఐటీ ఎగుమతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో తేలిందని మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్.కె.టి.ఆర్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. 2013-14లో అప్పటి కాంగ్రెస్ పాలనలో రూ. 57,258 కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ విప్లవాత్మకమైన నిర్ణయాలు, వినూత్న పాలసీలు, సరికొత్త కార్యక్రమాల వల్ల 2023-24 నాటికి రూ. 2,72,076 కోట్లకు చేరిందన్నారు. కేసీఆర్ గారి దార్శనికత వల్ల తెలంగాణ ఐటీ పవర్ హౌస్‌గా మారింది అనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఐటీ రంగంలో తెలంగాణ సాధించిన రికార్డులను వివరించారు. ప్రతి 3 ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణ నుండేఐటీ ఎగుమతుల్లో దేశంలోనే అత్యధిక పెరుగుదల: 299% ఐటీ ఉద్యోగాల్లో పెరుగుదల: 209%కొత్త ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణ వాటా: 33% తెలంగాణలోనే మొత్తం ఐటీ ఎగుమతులు: రూ. 2,72,076 కోట్లు 2023-24లో తెలంగాణలో మొత్తం ఐటీ ఉద్యోగాలు: 10 లక్షలు ఒక్క ఐటీ ఉద్యోగంతో పరోక్షంగా లభించే ఉద్యోగాల సంఖ్య: 4 ఈ లెక్కన మిగతా రంగాల్లో జరిగిన ఉద్యోగాల సృష్టి: 40 లక్షలని తన పోస్ట్ లో ఆయన పేర్కొన్నారు.