దలైలామాకు ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు

Spread the love

ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డును టిబెట్ అత్యున్నత బౌద్ధ మత గురువు దలైలామా గెలుచుకున్నారు. 90 సంవత్సరాల వయసులో ఇది గెలుచుకున్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. బెస్ట్ ఆడియో బుక్, నేరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్ జాబితాలో ఆయనకు ఈ పురస్కారం దక్కింది.మెడిటేషన్ అనే ఆల్బమ్ కు గానూ ఆయనకు ఈ అవార్డు వచ్చింది. అందులో ఆయన తన థాట్స్ అండ్ మెసేజెస్ ను ఆడియో రూపంలో అందించారు. మెడిటేషన్, శాంతి, దయ, అంతర్ముఖ పరిశీలన వంటి అంశాలపై ఆయన స్వయంగా చెప్పిన భావాలను ఈ స్పోకెన్-వర్డ్ ఆల్బమ్ తో  ప్రజలకు అందించారు. దలైలామా చేసిన ఈ ప్రసంగాలకు.. సరోద్ వాయిద్యకారుడు అంజద్ అలీఖాన్ నేపథ్య సంగీతం  అందించారు. అమెరికా లోని కాలిఫోర్నియా వేదికగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమం జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా తమ సంగీతంతో ఆకట్టుకున్న వ్యక్తులు ఈ అవార్డులు అందుకున్నారు.