లండన్ చేరుకున్న మంత్రి నారాయణ బృందం

Spread the love

ఏపీ మంత్రి నారాయణ బృందం లండన్ చేరుకుంది. మంత్రి వెంట లండన్ వెళ్లిన వారిలో మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్,అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ ఉన్నారు. అమరావతి నిర్మాణంలో భాగంగా పలు ప్రాజెక్టులను ఈ పర్యటనలో మంత్రి బృందం అధ్యయనం చేయనుంది. లండన్ కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు లండన్  సిటీ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ రిచర్డ్స్ తో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 1:30 కి బెటార్సి పవర్ స్టేషన్ ను సందర్శించనున్నారు. థేమ్స్ రివర్ ఫ్రంట్ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. సాయంత్రం 4:30 కి లండన్ బ్రిడ్జి నిర్మాణ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తారు.