అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా తనదైన మేకింగ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఇక తాజాగా ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న ప్రభాస్ హీరోగా ఆయన చేస్తున్న చిత్రం ‘SPIRIT’. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ మూవీ 2027 మార్చి 5న, మహాశివరాత్రికి ముందే థియేటర్లలోకి రానుంది. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న భారీ సినిమా కావడంతో, ఈ రిలీజ్ ప్లానింగ్ చాలా స్ట్రాటజిక్‌గా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు విడుదలైన స్పిరిట్ ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఒక్క అప్డేట్‌తోనే హైప్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా ప్రభాస్ కెరీర్‌లో తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించబోతుండటమే అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.ఈ సినిమాలో ప్రభాస్ పూర్తిగా సరికొత్త లుక్, బలమైన కథతో కనిపించనున్నారని టాక్. ‘యానిమల్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్‌తో స్పిరిట్ బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్ అందుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు.