ఆకట్టుకుంటున్న ‘రణబాలి’ గ్లిమ్ప్స్

Spread the love

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం ‘రణబాలి’. రష్మిక మంథన కథానాయికగా నటిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూవీ గ్లిమ్ప్స్ తాజాగా విడుదలైంది. కాగా, దీనికి వస్తున్న ఆదరణ చాలా బాగుంది.  ‘టాక్సీవాలా’ విజయం తర్వాత విజయ్ దేవరకొండ దర్శకుడు రాహుల్ కలయికలో వస్తున్న రెండో సినిమా ఇది. 1854 – 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జయమ్మగా రష్మిక అలరించనున్నారు. సర్ థియోడోర్ హెక్టార్ అనే బ్రిటిష్ అధికారి పాత్రలో ఆర్నాల్డ్ అలరించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. గతేడాది విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్ డమ్’ ఆయన ఫ్యాన్స్ ను మెప్పించింది.