ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ సర్ డొనాల్డ్ బ్రాడ్ మన్ క్యాప్ కు భారీ ధర

Spread the love

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ సర్ డొనాల్డ్ బ్రాడ్ మన్ క్యాప్ కు భారీ ధర పలికింది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప క్రికెటర్ గా పేరు గడించిన ఆయన  ఉపయోగించిన బ్యాగీ గ్రీన్ క్యాప్ కూడా రికార్డ్ సృష్టించింది. 1947-48లో భారత క్రికెటర్ శ్రీరంగ వాసుదేవ్ సాహోనికి బ్రాడ్ మన్  బహుమతిగా ఇచ్చిన క్యాప్ ను ఇటీవల వేలం వేయగా.. రూ.4 కోట్ల 21 లక్షలకు ఒక వ్యక్తి దక్కించుకున్నారు.  శ్రీరంగ వాసుదేవ్ కుటుంబం ఈ టోపీని 75 ఏళ్ల నుంచి భద్రపరిచింది. ఈ టోపీ లోపల బ్రాడ్ మన్  వాసుదేవ్ పేర్లు ఉన్నాయి. గతంలోనూ ఆయన  టోపీలను వేలం వేయగా భారీ ధర పలికాయి. 1947-48లో లాలా అమర్ నాథ్ సారథ్యంలోని భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటించింది. అయిదు టెస్టుల సిరీస్ ను 4-0తో ఓడింది. ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. భారత  స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి ఆస్ట్రేలియా పర్యటన అదే కావడం గమనార్హం.