2023లో విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ మూవీ దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ మూవీ అదే స్థాయిలో వివాదాస్పదం కూడా అయింది. ఇక ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్గా ‘ది కేరళ స్టోరీ 2’ రాబోతోంది. కామాఖ్యా నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ విడుదలైంది. ఈ సీక్వెల్ మరింత భయంకరమైన చీకటి కథను వెలుగులోకి తెస్తుంది. నిర్మాత విపుల్ అమృతాలాల్ షా చిత్రీకరణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కఠినమైన భద్రతను పాటించారని చిత్ర వర్గాలు తెలిపాయి. సీక్వెల్ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.