అసెంబ్లీ లాబీలో మీడియాతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చిట్ చాట్ నిర్వహించారు. తమ విధులు సక్రమంగా నిర్వర్తించని ఎమ్మెల్యేలను ప్రజలు రీకాల్ చేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ కార్యకలాపాలకు హాజరుకావడం ఎమ్మెల్యేల విధి అని కొందరు అసలు సభకు రాకుండా జీతభత్యాలు తీసుకోవడం తగదని అన్నారు. ఉద్యోగులు ఆఫీసులకు రాకపోతే వారికి జీతాలు కట్ చేసే చర్యను ఎమ్మెల్యేలకు ఎందుకు తీసుకోకూడదని అన్నారు. ఈ అంశాలపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని ఈ రూల్ దాదాపు 8 దేశాలలో అమలులో ఉందన్నారు. అసెంబ్లీలో కొత్తగా చేపట్టిన డిజిటల్ అటెండెన్స్ బాగా పనిచేస్తుందని కొనియాడారు. ఎవరు ఎంత సేపు సభలో ఉన్నారనేది కూడా రికార్డు అవుతుందన్నారు.