హార్వర్డ్ యూనివర్సిటీలో “లీడర్‌షిప్ ఇన్ ద 21st సెంచరీ” ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 

Spread the love

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. నేడు ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ యూనివర్సిటీ Kennedy_School లో తన  ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ “Leadership in the 21st century” పూర్తి చేసినట్లు తెలిపారు. ఈమేరకు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇది  తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. 20 దేశాల నుండి వచ్చిన 60 మందికి పైగా విద్యార్థులతో కూడిన ఈ తరగతి ద్వారా, అసాధారణమైన అధ్యాపకుల నుండే కాకుండా తోటి విద్యార్థుల నుండి కూడా ఎన్నో విషయాలను నేర్చుకున్నట్లు వివరించారు. గడ్డకట్టే చలి, 3 అడుగుల కంటే ఎక్కువ మంచు కురిసిన భీకరమైన మంచు తుఫాను మధ్య ఈ ప్రయాణం సాగిందని తెలిపారు. ఈ ప్రోగ్రామ్ సమయంలో, వివిధ విభాగాల్లో చదువుతున్న ఎంతో మంది విజయవంతమైన వ్యక్తులను కలిసే అవకాశం కూడా లభించిందని తెలిపారు.