శర్వానంద్ – శ్రీను వైట్ల మూవీలో రుక్మిణీ వసంత్..?

Spread the love

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, సీనియర్ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది.ఈ చిత్రంలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ఎంపికైనట్లు సమాచారం.గతేడాది గోపీచంద్‌తో తీసిన ‘విశ్వం’ ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో, ఈసారి శర్వానంద్‌ కోసం ఒక పక్కా స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు శ్రీను వైట్ల.చిన్న వయసులో ఆవేశంగా చేసిన ఒక పని వలన హీరో జీవితంలో ఎదురయ్యే మలుపులు, డ్రామా ఈ చిత్రానికి ప్రధాన బలం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాలో ఒక సీనియర్ హీరో కూడా కీలక పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం ద్వారా శ్రీను వైట్ల మళ్లీ తన ఫామ్‌లోకి రావాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నారు.