‘ధురంధర్’ నెక్స్ట్ పార్ట్ నుండి కీలక అప్డేట్..విడుదలైన టీజర్  

Spread the love

బాక్సాఫీస్‌ను గట్టిగా షేక్ చేసిన ‘ధురంధర్’ సినిమాతో దర్శకుడిగా మరోసారి తన స్టామినాను నిరూపించుకున్నారు ఆదిత్య ధార్. ఇప్పుడు అదే ఊపుతో ‘ధురంధర్ 2’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే సన్నాహాల్లో ఆయన బిజీగా ఉన్నారు. ‘ధురంధర్’ సినిమా గతేడాది డిసెంబర్‌లో విడుదలై ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాతో ఆదిత్య ధార్ పేరు మారుమోగుతోంది. రణ్ వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ తదితరుల నటన, ఆదిత్య ధార్ డైరెక్షన్, కథాకథనాలు ఈ మూవీని అద్భుత విజయం అందుకునేలా చేశాయి. ఇక తాజాగా ఈ మూవీ రెండో భాగాన్ని విడుదల తేదీని టీజర్ ను ప్రకటించారు. ‘ధురంధర్;ది రివేంజ్’గా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ ను చూస్తుంటే ఇది కూడా మొదటి భాగాన్ని మించి అలరించేలా కనిపిస్తోంది. ఈ మూవీ మార్చి 19న విడుదల కానుంది.