భారత్ పై అమెరికాల మధ్య టారిఫ్ లను తగ్గింపుపై ఇరు పక్షాల నుండి కీలక ప్రకటనలు వెల్లడైన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఇదొక చారిత్రాత్మక మైలురాయి! అని పేర్కొన్నారు. అమెరికాతో ఈ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నందుకు ప్రధాని మోడీకి సోషల్ మీడియా ‘ఎక్స్’ లో అభినందనలు తెలిపారు. టారిఫ్ (సుంకాలు)లను 18 శాతానికి తగ్గించడం అనేది ప్రపంచంలోని రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేసే ఒక దూరదృష్టితో కూడిన చర్య, ఇది ప్రపంచ వృద్ధి నిరంతరాయంగా కొనసాగేలా చేస్తుందన్నారు. ప్రధాని నాయకత్వంలో, భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా తన పాత్రను సుస్థిరం చేసుకుంటోంది. ఈ ఒప్పందం భారతదేశ ఎగుమతుల పోటీతత్వాన్ని గణనీయంగా పెంచుతుంది, తద్వారా మన యువతకు మరియు ఆంధ్రప్రదేశ్‌లోని రైతులతో సహా దేశవ్యాప్త రైతులకు అపారమైన అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు.