విడుదలైన మెగాస్టార్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ పెద్దిరెడ్డి సాంగ్

Spread the love

సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి మెగాస్టార్ చిరంజీవి స్టామినాను మరోసారి చాటిచెప్పిన  చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. తాజాగా ఈచిత్రం నుండి ఓ కొత్త అప్‌డేట్ వచ్చేసింది. సినిమాలో ప్రేక్షకులతో ఈలలు వేయించిన “పెద్ది రెడ్డి” ఫుల్ వీడియో సాంగ్‌ తాజాగా విడుదలైంది. ఈ చిత్రం ఇప్పటికే 400 కోట్ల రూపాయల వసూళ్ల క్లబ్‌కు చేరువలో ఉండటం విశేషం. ఈ మాస్ పాటకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి పర్యవేక్షణలో చిత్రీకరించిన ఈ పాటలో చిరంజీవి తనదైన శైలిలో మాస్ స్టెప్పులతో చెలరేగారు. అంతేకాకుండా ఈ పాటను స్వయంగా ఆయనే ఆలపించడం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ మరో హైలెట్ గా నిలిచింది. రఘురాం రాసిన సాహిత్యం పాట‌కు జోష్ ఇచ్చింది. విడుదలైన కొన్ని క్షణాల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.