భారత్ సంస్కరణల ఎక్స్ ప్రెస్ లా ముందుకెళ్తోంది:ప్రధాని మోడీ

Spread the love

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. ఇటీవల యూరోపియాన్ యూనియన్ తో కుదిరిన స్వేచ్చాయుత వాణిజ్యం (FTA) పై ప్రస్తావించారు. ప్రస్తుతం భారత్ సంస్కరణల ఎక్స్ ప్రెస్ లా దూసుకెళ్తోందన్నారు. ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు. ఇక టెక్నాలజీ మనిషికి ప్రత్యామ్నాయం కాదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రపంచానికి భారత్ ఆశా కిరణమని ఇటీవల రాష్ట్రపతి ప్రసంగం భారత ప్రజల ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబించిందన్నారు. భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. పెండింగ్ సమస్యలకు పరిష్కారం దొరుకుతుండడంతో సుస్థిర దేశంగా ప్రపంచం భారత్ ను చూస్తుందన్నారు. వాణిజ్య ఒప్పందంతో కొత్త అవకాశాలు లభిస్తాయన్నారు. వాటి నుంచి తయారీ దారులు లబ్దిపొందుతారన్నారు. ఈయూ దేశాలకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలన్నారు. మనం సాంకేతికతతో పోటీపడతాం. దానిని అందిపుచ్చుకుంటాం. దాని కెపాసిటీని అంగీకరిస్తాం. అయితే మనుషులకు ఎప్పుడూ సాంకేతికత భర్తీ చేయలేదని అన్నారు.