నేచురల్ స్టార్ నాని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కీలక అప్డేట్ అధికారికంగా ‘పారడైస్’ మూవీ టీమ్ ప్రకటించింది. రిలీజ్ డేట్ ను ఆగస్ట్ 21ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కాయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు శికంజ మాలిక్ గా, రాఘవ్ జుయెల్ ప్రధాన ప్రతినాయకులుగా కనిపించనున్నారు. అదనంగా సంపూర్ణేష్ బాబు ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతుండటం ఆసక్తిని మరింత పెంచుతోంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు.మొత్తం మీద యాక్షన్, ఎమోషన్స్, సంగీతం కలిసిన భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నాని కెరీర్‌లో మరో ప్రత్యేక మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో చర్చలు మొదలవడం, అంచనాలు పెరగడం చూస్తుంటే ఆగస్ట్ 21కు బాక్సాఫీస్ వద్ద భారీ స్పందన రావడం ఖాయమనే సంకేతాలు ఇప్పటినుంచే కనిపిస్తున్నాయి.