ఇప్పుడు నవీన్ పోలిశెట్టినే  మినిమం గ్యారెంటీ స్టార్

Spread the love

అసలు అంతకుముందు మనం 100 డేస్, 200 డేస్ సినిమాలు కూడా చూసాం థియేటర్స్ లో అంత ఎందుకు షారుఖ్ ఖాన్ కాజోల్ ల ‘Dilwale Dulhania Le Jayenge ‘ సినిమా ఎన్ని రోజులు థియేటర్స్ లో ఉందొ తెలుసు కదా… అలా మన బాలయ్య, చిరు సినిమాలు కూడా థియేటర్స్ లో సందడి చేసాయి… కానీ covid తరవాత సీన్ పూర్తిగా మారింది!  భారీ బడ్జెట్లు, పెద్ద స్టార్ పేర్లు ఉన్నా కూడా ఫలితం గ్యారంటీ కాదు. ఒక్క సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది చివరి వరకు ఎవరికీ అర్థం కాని స్థితి. ఇలాంటి గందరగోళ సమయంలో… ఎలాంటి హడావిడి లేకుండా, నెమ్మదిగా నవీన్ పోలిశెట్టి ఒక మినిమం గ్యారెంటీ స్టార్‌గా ఎదిగాడు. ఇండస్ట్రీకి అత్యంత విలువైన విషయం ఏంటంటే లైన్ గా బాక్స్ ఆఫీస్ కి విజయాన్ని అందిస్తున్న అరుదైన హీరోగా నిలిచాడు.ఇప్పుడు నవీన్ పోలిశెట్టి ఖాతాలో ఒక ప్రత్యేకమైన రికార్డ్ చేరింది. థియేటర్లలో విడుదలైన అతని నాలుగు సినిమాలు — ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు — నాలుగూ హిట్లుగా నిలిచాయి. ముఖ్యంగా అనగనగా ఒక రాజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటడంతో, నవీన్ అధికారికంగా ఒక కొత్త లీగ్‌లోకి అడుగుపెట్టాడు. ఇది అతని కెరీర్‌లో తొలి 100 కోట్ల సినిమా కావడంతో పాటు, ఓవర్సీస్‌లో ముఖ్యంగా అమెరికా మార్కెట్‌లో మరోసారి తన స్టామినాను నిరూపించింది.ఈ విజయంలో ప్రత్యేకత కేవలం నంబర్లలోనే కాదు… ఆ విజయం వెనుక ఉన్న ప్యాటర్న్లో ఉంది. వేర్వేరు ప్రొడక్షన్ హౌసులు, వేర్వేరు జానర్లు, వేర్వేరు దర్శకులు… అయినా ఫలితం మాత్రం ఒకటే — విజయం. నవీన్ పోలిశెట్టి పేరు ఉన్నచోట సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తోంది అన్న నమ్మకం ట్రేడ్‌లో బలంగా ఏర్పడుతోంది. అదే అతన్ని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఒక నమ్మకమైన పేరుగా మార్చింది.ఇప్పుడు పెరుగుతున్న బడ్జెట్, మారిపోతున్న ప్రేక్షకుల అభిరుచులు చాలా బ్యానర్లను కలవరపెడుతున్నాయి. కానీ నవీన్ పోలిశెట్టి సినిమా అంటే మాత్రం ట్రేడ్‌లో ఒక ధైర్యం కనిపిస్తోంది. నవీన్ ఉన్నాడు అంటే రిస్క్ తక్కువ… రిటర్న్స్ సేఫ్ అన్న భావన నెమ్మదిగా బలంగా పాతుకుపోతోంది.ఈ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి — నటనతోనే ఆగిపోకుండా, సినిమాపై అతను తీసుకునే బాధ్యత. కథ, రైటింగ్, డైలాగ్స్ విషయంలో నవీన్ చురుకుగా పాల్గొంటాడు. అంతేకాదు, ప్రమోషన్లలో కూడా పూర్తి ఇన్వాల్వ్‌మెంట్ చూపిస్తూ సినిమా ప్రేక్షకులకు చేరేలా చూసుకుంటాడు. ఈ ఓనర్‌షిప్ ఆన్‌స్క్రీన్‌లోనూ, బాక్సాఫీస్ వద్ద కూడా స్పష్టంగా కనిపిస్తుంది.ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ — బడ్జెట్ డిసిప్లిన్. నవీన్ సినిమాలు లిమిటెడ్ ఖర్చులతో, స్పష్టమైన ప్లానింగ్‌తో, అనవసర వ్యయాలు లేకుండా రూపొందుతాయి. దీని వల్ల ప్రాఫిట్ మార్జిన్స్ పెరుగుతాయి, పెట్టుబడిపై మంచి రాబడి వస్తుంది. అదే కారణంగా అతని ప్రాజెక్టులు అందరికీ ఆకర్షణీయంగా మారుతున్నాయి. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ నవీన్ గ్రాఫ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అనగనగా ఒక రాజు అమెరికాలో 2 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించే దిశగా సాగుతోంది. ఇది అతని మార్కెట్ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, అంతర్జాతీయ ప్రేక్షకులకూ కనెక్ట్ అవుతుందని స్పష్టంగా చూపిస్తోంది. అంతేకాదు… పోటీ అత్యంత బిజీ గా ఉండే సంక్రాంతి సీజన్లో కూడా పెద్ద హిట్ ఇవ్వడం, అతని విజయం టైమింగ్ లేదా లక్ మీద ఆధారపడలేదని, పూర్తిగా ప్రేక్షకుల నమ్మకంపై ఆధారపడిందని నిరూపిస్తోంది. సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, కేవలం ప్రతిభ, తెలివైన నిర్ణయాలు, కష్టపడి చేసిన పని మీదే ఈ స్థాయికి చేరుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ రోజు అతను కేవలం ఒక నటుడిగా కాదు… టాలీవుడ్‌లో ఒక నమ్మదగిన బ్రాండ్ గా గుర్తింపు పొందుతున్నాడు.నాలుగు సినిమాలు… నాలుగు హిట్లు… పెరుగుతున్న బాక్సాఫీస్ బలం… ఇవన్నీ చూస్తే ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత బ్యాంకబుల్ స్టార్స్‌లో నవీన్ పోలిశెట్టి ఒకడు అన్నది ఎలాంటి సందేహానికీ తావు లేని  నిజం.