2026 నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని సివిల్ సర్వీస్ అధికారులకు (IAS, IPS, IFS, IRS) ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.ప్రభుత్వ పరిపాలనలో అధికారులే వెన్నెముక అని, తమ సొంత రాష్ట్రాలను వదిలి ఏపీ ప్రజల సేవ కోసం ఇక్కడ పనిచేస్తున్న అధికారుల నిబద్ధతను తాము గౌరవిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.అసెంబ్లీలో తాము చట్టాలను రూపొందిస్తే, వాటికి క్షేత్రస్థాయిలో ప్రాణం పోసే బాధ్యత అధికారులదేనని పవన్ అభివర్ణించారు.సామాన్యుడి జీవితంలో నిజమైన మార్పు అధికారుల చిత్తశుద్ధి వల్లనే సాధ్యమవుతుందని, రాజకీయ నాయకులు కేవలం దిశానిర్దేశం మాత్రమే చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ‘వికసిత్ ఆంధ్రప్రదేశ్’ సాధనే లక్ష్యంగా, 2026లో యంత్రాంగం మరింత మానవీయ కోణంతో, వేగంగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.ఏపీ పునర్నిర్మాణం అనేది ఒక సమిష్టి స్వప్నమని, దీనిని సాకారం చేయడంలో అధికారుల పాత్ర కీలకమని గుర్తుచేస్తూ నూతనోత్సాహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వానికి అధికారులే వెన్నెముక: ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు!