‘రణబాలి’ గుర్రపు స్వారీ..ఆసక్తికరమైన వీడియో పంచుకున్న టీమ్

Spread the love

విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రణబాలి’. 1854 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ హార్స్ రైడింగ్ కూడా  నేర్చుకున్నారు. తాజాగా దానికి సంబంధించిన బీటీఎస్ (Behind the scenes) వీడియోను టీమ్ పంచుకుంది. నేడు విజయ్ పుట్టినరోజు కావడంతో ఆ వీడియోతో మూవీ టీమ్ విషెస్ తెలిపింది. డైరెక్టర్ రాహుల్ విజయ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు. సినిమా ప్రపంచంలో నాకెంతో ప్రియమైన సోదరుడికి, నా ఫిలిం మేకింగ్  ప్రయాణంలో నా తోడుగా నిలిచిన సహచరుడికి.

అత్యంత మధురమైన చిరునవ్వు, ప్రశాంతమైన స్వభావం కలిగి ఉండి కూడా, చైతన్యం మరియు ఏకాగ్రత కలిగిన వ్యక్తి.అరుదైన మరియు విలక్షణమైన వ్యక్తిత్వం కలవాడు అని విజయ్ ను కొనియాడారు. విజయ్, నువ్వు చాలా ప్రత్యేకం.నువ్వు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఇక విడుదల చేసిన బీ.టీ.ఎస్ వీడియోలో గుర్రపు స్వారీ కోసం విజయ్ ఎంత హార్డ్ వర్క్ చేశారో చూపించారు. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక మంథన నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన అప్డేట్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ పతాకాలపై గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో తెరకెక్కుతోంది. నవీన్ ఎర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. అజయ్ అతుల్ సంగీతం సమకూరుస్తున్నారు. సెప్టెంబర్ 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *