గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పై రాష్ట్ర సచివాలయంలో జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మోడ్రనైజేషన్, అర్బనైజేషన్ తో భవిష్యత్ లో మరిన్ని నూతన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నగరాన్ని ట్రాఫిక్ రహిత, పార్కింగ్ సమస్య రహిత, కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మొత్తం తెలంగాణను CURE, PURE, RARE జోన్లుగా వర్గీకరించి, డెవలప్మెంట్ ప్లాన్స్ అమలు చేస్తున్నామన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ను డెవలప్ చేయడంతో పాటు మన కల్చర్ కు కనెక్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ మాగుంట శ్రీనివాసుల రెడ్డి అధ్యక్షత వహించగా, పలువురు ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.