‘ధురంధర్’ చిత్రం నుండి ఆ పదాలు తొలగింపు..!

Spread the love

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూనే, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని కీలక మార్పులతో నేడు థియేటర్లలో తిరిగి విడుదలైంది.చిత్రంలో సామాజిక ,రాజకీయ సున్నితత్వం కలిగిన ‘బలోచ్’ అనే పదాన్ని, మరికొన్ని సంభాషణలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచనల మేరకు చిత్ర బృందం మ్యూట్ చేసింది.ఈ మేరకు పాత ప్రింట్ స్థానంలో మార్పులు చేసిన కొత్త డిజిటల్ సినిమా ప్యాకేజీని (DCP) జనవరి 1 నుండి ప్రదర్శించాలని డిస్ట్రిబ్యూటర్లు దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లకు ఆదేశాలు జారీ చేశారు.’ఉరి’ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం పాకిస్థాన్ ఉగ్రవాదం ,ప్రభుత్వ యంత్రాంగం మధ్య ఉండే సంబంధాల నేపథ్యంలో సాగుతుంది.సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా,ఆర్. మాధవన్ వంటి అగ్ర తారాగణం నటించిన ఈ చిత్రం, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన కల్పిత గాథ అని సెన్సార్ బోర్డు ఇప్పటికే ధృవీకరించింది.వివాదాస్పద అంశాలను తొలగించినప్పటికీ, సినిమాపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా రికార్డు వసూళ్ల దిశగా దూసుకుపోతోంది.