హెచ్ 1 బీ, గ్రీన్ కార్డ్ విషయంలో అమెరికా కొత్త నిర్ణయం..వేతనమే ప్రామాణికం

Spread the love

H1-B వీసాలు, గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న అదృష్టపు లాటరీ పద్ధతికి స్వస్తి పలికి, అత్యధిక జీతం ఇచ్చే మెరిట్ పద్ధతికి పెద్దపీట వేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా ఇమ్మిగ్రేషన్ రూల్స్‌ను పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా ఆశపడే H1-B Visas ,  Green Cards విషయంలో సరికొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.  2027 ఆర్థిక సంవత్సరం నుండి వీసా ఎంపిక విధానం పూర్తిగా మారిపోనుంది. గతంలో H1-B వీసాలను ర్యాండమ్ లాటరీ (Random Selection) ద్వారా ఎంపిక చేసేవారు. అయితే కొత్త రూల్ ప్రకారం.. ఎవరికైతే ఎక్కువ జీతం ఉంటుందో, వారికే మొదటి ప్రాధాన్యత లభిస్తుంది. అమెరికా వేతన వ్యవస్థను నాలుగు స్థాయిలుగా విభజించారు. ఈ కొత్త విధానం వల్ల లాటరీలో పాల్గొనే అవకాశాలు కూడా జీతంపైనే ఆధారపడి ఉండనున్నాయి. ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలుపెట్టే జూనియర్ లకు కొంత కష్టకాలమే అని చెప్పాలి. ఎందుకంటే వీరి శాలరీ లెవల్స్ తక్కువగా ఉండటం వల్ల ప్రయారిటీ లిస్టులో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది.కేవలం H1-B మాత్రమే కాదు, గ్రీన్ కార్డ్  రూల్స్‌లో కూడా భారీ మార్పులు వస్తున్నాయి. భారతీయులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న Country-based Quota పై కూడా చర్చ జరుగుతోంది.హై-లెవల్ స్కిల్స్ ఉన్న వారికి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ వేగవంతం చేయాలని అమెరికా భావిస్తోంది. ఎక్కువ మందిని తీసుకోవడం కంటే, దేశానికి ఉపయోగపడే ‘క్వాలిటీ’ పీపుల్ ని ఉంచుకోవడమే లక్ష్యం. పాత లాటరీ పద్ధతిని పక్కన పెట్టి, హెచ్-1బీ  తరహాలోనే ‘వేజ్ బేస్డ్ సెలక్షన్’  తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి ఏటా 55,000 గ్రీన్ కార్డులను మంజూరు చేసే యూఎస్‌సీఐఎస్ (USCIS), ఇకపై జీతాల ఆధారంగా అభ్యర్థులను వడపోస్తుంది. కాలం మారుతోంది, కాలంతో పాటు అమెరికా రూల్స్ కూడా మారుతున్నాయి. నైపుణ్యం ఉండి ఎక్కువ సంపాదించే వారికే గ్రీన్ కార్డ్ వరించనుంది. కాబట్టి, అమెరికా వెళ్లాలనుకునే వారు కేవలం అదృష్టాన్ని నమ్ముకోకుండా, తమ స్కిల్స్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. అమెరికా వెళ్లాలంటే ఇకపై కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు, ఆ టాలెంట్‌కు భారీ ప్యాకేజీ కూడా తోడవ్వాలి. “Survival of the fittest” అనే సామెత ఇప్పుడు అమెరికా వీసాలకు సరిగ్గా సరిపోతుంది. మరి ఈ కొత్త నిబంధనల వల్ల ఎంతమంది భారతీయుల కల నెరవేరుతుందో వేచి చూడాలి.