రవి తేజ కొత్త సినిమా టైటిల్ ‘ఇరుముడి’

Spread the love

రవి తేజ… ఫాన్స్ అతన్ని ముద్దుగా మాస్ మహారాజ గా పిలుచుకుంటారు… స్క్రీన్ పై రవి తేజ చూపించే ఎనర్జీ అలాంటిది మరి. అందుకే రవి తేజ అంటే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు ప్రత్యేకమే. అందుకే అయన ప్రతి సినిమా డీసెంట్ హిట్ అవుతుంది… మొన్నే సంక్రాంతికి వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కూడా మంచి హిట్ అయ్యింది. ఐతే మన మాస్ మహారాజ నెక్స్ట్ ఈ సినిమాలు చేస్తాడు అనేదే అందరి మనసులో ఉన్న మాట. ఈరోజు రిపబ్లిక్ డేతో పాటు తన బర్త్ డే  సందర్బంగా, కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి, అదిరే అప్డేట్ ను  ఇచ్చేసాడు రవి తేజ. ఎప్పుడు లవ్ స్టోరీస్, యాక్షన్ సినిమా లు చేసే రవి తేజ ఈసారి భక్తి సినిమా చేయబోతున్నాడు… ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేసి, ‘ఇరుముడి’ గా ప్రకటించారు. ఈ సినిమా పోస్టర్ లో రవి తేజ అయ్యప్ప మాల వేసుకుని, ఒక పాప ని ఎత్తుకున్నారు. అలాగే చుట్టూ అయ్యప్ప స్వాముల భజన చేస్తున్నట్టు చూపించారు… ఇలా ఒక భక్తి సినిమాలో రవి తేజ కనిపించడం ఫాన్స్ ని ఇంప్రెస్స్ చేస్తుంది.ఈ సినిమా కి ఫామిలీ సినిమాలు తీయడం లో దిట్ట అయిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక మ్యూజిక్ ని జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు.